కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రధాన మంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితమని.. ప్రైవేట్‌లో 250 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు వారికి విజ్ఞప్తి చేశారు.