దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ కోవిడ్ ఆంక్షలను కేంద్రం ఏమాత్రం సడలించలేదు కదా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడగించింది. అదేసమంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, కోవిడ్ బాధితుల రికవరీ రేటు పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుద చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, మరో 11 రాష్ట్రాల్లో 50,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం వివరించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 77 శాతానికి పైగా 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి గుర్తుచేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.