ఎన్-440 రకం వైరస్ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల నిర్ధారించినట్టు చత్తీస్‌గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకం కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటిష్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
కాగా, బుధవారం రాష్ట్రంలో కొత్తగా 4,563 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగుచూసిన రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. అలాగే, నిన్న 39 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,170కి పెరిగింది.