గుజరాత్‌లో సూపర్ వేరియంట్.. 120 రెట్లు వేగంతో...

శనివారం, 31 డిశెంబరు 2022 (20:11 IST)
గుజరాత్‌లో సూపర్ వేరియంట్ నమోదైంది. బీఎఫ్ 7 వేరియంట్ కేసులు భారత్‌లో కనిపించిన నేపథ్యంలో.. తాజాగా మిగిలిన వేరియంట్ కంటే ఇది 120 రెట్లు వేగంతో వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు. 
 
అందుకే కొత్త సంవత్సర వేడుకలతో పాటు పండుగలు కూడా వుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎక్స్‌బీబీ 1.5 వేరియంట్‌ను సూపర్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతాయని నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు