కాగా, ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ వణికిపోతోంది. పైగా, ఈ దేశంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది మందిని ఆస్పత్రిపాల్జేసింది. ఈ వైరస్ సోకడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనిపై ఇదే తరహా అంచనాలు వెలువరించింది. ఇతర కరోనా రకాలతో పోల్చితే ఇది 70 శాతం వేగవంతమైనదని పేర్కొంది. ఇప్పటివరకు ఇది 12 ఉత్పరివర్తనాలకు లోనైందని, కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లపై ఈ అంశం ప్రభావం చూపుతుందని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలన్స్ తెలిపారు.