కరోనా మహమ్మారి తీవ్రత ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా గణాంకాలు దేశానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. శుక్రవారం 62 వేల 104 కొత్త కేసులు నమోదు కాగా 70 వేల 386 మంది రోగులు కోలుకున్నారు. ఇదిలా ఉండగా 839 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8 లక్షలు కన్నా ఎక్కువగా వచ్చాయి.
దేశంలో మొత్తం 7 లక్షల 94 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యా ప్తంగా మొత్తం 74.34 లక్షల కేసులు నమోదు కాగా 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 90శాతం కంటే ఎక్కువ మంది రోగులు కోలుకున్నారు. ఇది జాతీయ సగటు 87.8 శాతాని కంటే ఎక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ సంఖ్య 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ కూడా రికవరీ రేటు ఉంటుందని తెలిపింది. మరోవైపు రాబోయే రెండున్నర నెలలు చాలా కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం అన్నారు. పండుగ సీజన్‌తో పాటు, చలికాలం రాబోతుండటంతో కరోనా సంక్రమణ అధికమవుతుందని తెలిపారు.