వైద్యుడా వందనం... ఐదు రోజుల తర్వాత ఇంటికి.. అయినా ఆరుబయటే...

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:08 IST)
దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడిన వారిని కాపాడేందుకు వైద్యులు, నర్సులు తమ శక్తినంతటినీ ధారపోస్తూ, రేయింబవుళ్ళూ శ్రమిస్తున్నారు. అనేక మంది వైద్యులు ఇళ్ళకు పోవడంమానేశారు. తమ భార్యాపిల్లలను చూడటం మరచిపోయారు. కేవలం కరోనా రోగులకు వైద్య సేవలు అందించడంలోనే నిమగ్నమయ్యారు. 
 
అలాంటివారిలో డాక్టర్ సుధీర్ దేహారియా ఒకరు. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజాధాని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కరనా వైరస్ బారిన తమ ఆస్పత్రిలో చేరే వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. అలా గత ఐదు రోజులుగా ఆయన విధుల్లోనే నిమగ్నమయ్యారు. 
 
ఐదు రోజుల తర్వాత అంటే మంగళవారం తన భార్యాపిల్లలను చూసేందుకు ఇంటికి వెళ్లారు. కానీ, ఇంట్లోకి వెళ్లలేదు. ఇంటి వాకిట్లోనే కూర్చొని తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 
 
ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. అంతే.. డాక్టర్ సుధీర్ ఫోటోను సీఎం చౌహాన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతలో షేర్ చేశారు. డాక్టర్ సుధీర్ దేహరియా ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చి, ఇంటి బయటనే కూర్చుని టీ తాగారు. బయటి నుండే తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. హ్యాట్సాఫ్ టు డాక్టర్ సుధీర్ అంటూ కితాబిచ్చారు. 
 

मिलिये डॉ. सुधीर डेहरिया से, जो भोपाल जिले के CMHO हैं। सोमवार को वो पाँच दिन बाद घर पहुंचे, घर के बाहर बैठ कर चाय पी, घर वालों का हाल चाल लिया और बाहर से ही अस्पताल वापस हो गए।

डॉक्टर डेहरिया और इन जैसे हज़ारों-लाखों #CoronaWarriors को मेरा शत-शत नमन। हमें आप पर गर्व है।

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు