కరోనా విజృంభణ.. ఇటలీ, స్పెయిన్‌లను దాటిన భారత్- 287మంది మృతి

ఆదివారం, 7 జూన్ 2020 (11:09 IST)
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 2.46 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 6,929కు చేరుకుంది. ఫలితంగా భారతదేశం కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో ఐదవ స్థానంలో నిలిచింది.
 
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 9,971 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో దేశంలో 287 మంది రోగులు మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,46,628 కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో 1,20,406మంది చికిత్స పొందుతూ ఉండగా, 1,19,293 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
మహారాష్ట్రలో కరోనా కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గట్లేదు. తమిళనాడు కూడా కరోనా కేసుల విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల ఐదుగురు సభ్యుల అంచనా ప్రకారం, జూన్ చివరి నాటికి ఢిల్లీలో కనీసం లక్ష కోవిడ్ కేసులు వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 6929 మంది మృత్యువాత పడ్డారు. 
 
పది వేల మార్క్‌కి కాస్త దగ్గరలో గత మూడు నాలుగు రోజులుగా దేశంలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. దీంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్ తాజాగా స్పెయిన్‌ను అధికమించి ఐదో స్థానానికి చేరుకుంది. అంతకుముందు శనివారం నాడు ఇటలీ కంటే ఎక్కువ కేసులతో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఒక్కరోజులోనే స్పెయిన్‌ను దాటిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు