చైనా కరోనాను పుట్టించేందుకు ముందే వ్యాక్సిన్ కనిపెట్టిందా? విస్తుపోయే నిజాలు

శనివారం, 29 ఆగస్టు 2020 (07:33 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ మొదట చైనాలోని వూహాన్ నుంచి పుట్టుకొచ్చింది. వూహాన్ వైరాలజీ ల్యాబ్ ఉండడంతో చైనానే దానిని తయారుచేసి ప్రపంచంపైకి వదిలిందని అందుకే అక్కడ కరోనా కేసులు నమోదయ్యాయినప్పటికీ సరైన చర్యలు తీసుకోకుండా.. కావాలనే ప్రపంచ దేశాలను ముందుగా హెచ్చరించలేదని ఆరోపణలు వచ్చాయి.
 
ఇటీవలే వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పనిచేసే సైంటిస్ట్ చైనానుండి పారిపోయి అమెరికా వచ్చింది. ఆమె కరోనా వైరస్‌ను చైనానే తయారు చేసి ప్రపంచానికి అంటించిందని ముందుగానే కరోనాకు వ్యాక్సిన్ కూడా కనిపెట్టి అక్కడి అధికారులకు, కొంతమంది ప్రజలకు ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు అవి ఆరోపణలు మాత్రమే కాదు.. పచ్చి నిజాలని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
 
తాజాగా చైనా తన ఫ్రంట్ లైన్ అధికారులు అంటే డాక్టర్లు, నర్సులు, పోలీసులు, రాజకీయ నేతలు, మరియు ఇంకోదరికి జూన్ నెలలోనే కరోనా వ్యాక్సిన్ ఇచ్చిందనే విషయం బయటపడింది. అప్పటినుంచి ప్రజలకు కూడా వ్యాక్సిన్ ఇస్తుందని అందుకే చైనాలోని ఫ్రంట్ లైన్‌లోని వారికి పెద్దగా కరోనా సొకలేదని తేలింది. నిజానికి వ్యాక్సిన్ పూర్తిగా తయారు కావాలంటే ఎనిమిది నెలలు పైనే పడుతుంది. 
 
కానీ.. చైనా జూన్ నెలలోనే తన ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిందంటే ముందుగానే వ్యాక్సిన్‌ను తయారుచేసింది. అంటే దానర్ధం కారోనాకు ముందుగానే సిద్ధపడింది. తాజాగా బయటపడిన నిజాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
దీనిపై చైనా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నవారికి, కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి సైనోవాక్‌ కంపెనీ తయారు చేస్తున్న 'కరోనావాక్‌' టీకాను ఇవ్వడానికి చైనా జూలైలోనే ఆమోదం తెలిపిందని సమాచారం.  
 
అయితే.. చైనాలో పరీక్షలదశలో ఉన్న మూడు టీకాల్లో కరోనావాక్ టీకా ఒకటి కావడం గమనార్హం. అయితే.. చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ కూడా ఇది నిజమేనని పేర్కొంది. ఆ టీకా ప్రయోగం సక్సెస్ అయితే.. అంతర్జాతీయంగా టీకా బిజినెస్‌లో కూడా చైనా ముందంజలో ఉంటూ.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు