తెలుగు రాష్ట్రాలో వైరస్ విజృంభణ : కరోనా వ్యాప్తికి కారణాలివేనా?

ఆదివారం, 2 ఆగస్టు 2020 (09:14 IST)
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి రోజూ కనీసం 7 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల పైలుకు కేసులు నమోదవుతుంటే... తెలంగాణాలో మాత్రం రెండు వేలకు వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. టెస్టుల సంఖ్యతోపాటు పెరుగుతోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్యా ఇదే విషయం స్పష్టం చేస్తోందనివారు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వ్యాధి నియంత్రణకే కాదు...  హోంఐసొలేషన్‌లో ఉంటున్న వారి ఇళ్లకు ఇతరులు వెళ్లకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇదే వైరస్‌ విజృంభణకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 
 
కేసుల సంఖ్యను బట్టి కాలనీలు, బస్తీలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వ విభాగాలు చేతులు దులుపుకుంటున్నాయి. గతంలోలా కట్టడి ప్రాంతాల్లో బారికేడ్ల ఏర్పాటు, బందోబస్తు లేదు. ఈ క్రమంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ఇళ్ల వద్ద 'ఈ భవనంలో హోం ఐసొలేషన్‌/క్వారంటైన్‌లో ఉన్నారు. ఇతరులు లోపలికి వెళ్లవద్దు' అని సూచించేలా స్టికర్లు అంటించాలి. క్వారంటైన్‌ గడువు ఎన్ని రోజులు అన్నది తెలిసేలా తేదీలు రాయాలి. 
 
కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. లాక్డౌన్‌ అమలు సమయంలో ప్రాంతాల వారీగా కట్టడి చేయడంతోపాటు ఇళ్ల ముందు స్టికర్లు అంటించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పాజిటివ్‌గా నమోదైన వారిలో లక్షణాలు, అనారోగ్య సమస్యలనుబట్టి హోంఐసొలేషన్‌లో ఉంచుతున్నారు. వైరస్‌ సోకిన వారితో పాటు ఆ ఇంట్లో ఉండే వారు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
కానీ జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. చాలా వరకు పాజిటివ్‌ కేసుల ఇళ్ల వద్ద బ్లీచింగ్‌ చల్లడాన్ని శానిటేషన్ విభాగం, సోడియం హైపో క్లోరైట్‌ ద్రావకం పిచికారీ చేయడాన్ని ఎంటమాలజీ విభాగాలు పట్టించుకోవడం లేదు. ఫోన్లు చేసినా స్పందించడం పలువురు ఆరోపిస్తున్నారు. అటు స్టికర్లు అంటించక, ఇటు వైరస్‌ నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం స్థానికంగా తెలియడం లేదు. దీంతో సాధారణ రోజుల్లానే ఆయా ఇంటి పరిసరాలకు, ఇళ్లల్లోకి వెళ్తోన్న వారు వైరస్‌ బారిన పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు