దేశంలో కొత్తగా 96 కరోనా కేసులు - రికవరీ 98 శాతం

శుక్రవారం, 16 జూన్ 2023 (16:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. నెల రోజుల క్రితం సుమారుగా పది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇపుడు ఈ కేసుల సంఖ్య కేవలం 96కు పడిపోయింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడిన వారిలో కోలుకునే వారి సంఖ్య 98.81 శాతంగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5,31,893కు చేరుకుంది. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,93,282కు చేరుకుంది. 
 
భారత్‌లో కరోనా రికవరీ శాతం 98.81 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో విడుదల చేసింది. మృతుల సంఖ్య 1.18 శాతంగా ఉంది. మరోవైపు, శుక్రవారం 96 కేసులు నమోదయ్యాయని, దీంతో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2017కు తగ్గినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా 220.66 కోట్ మేరకు కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

వెబ్దునియా పై చదవండి