దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి : నాలుగో అల హెచ్చరికలు

గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:59 IST)
దేశంలో కరనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం సూచనలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
రోజువారీగా నమోదయ్యే కరోనా పాజివిట్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా బులిటన్ మేరకు గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ముంళవారం మొత్తం 3303 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం అదనంగా మరో 376 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుంత రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు