కరోనా టీకాలతో ఇబ్బందులు తప్పవని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా ఎంఆర్ఎన్‌ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ డాక్టర్ జోసెఫ్ తెలిపారు. అయితే భారత్‌లో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే
ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది.