థర్డ్ వేవ్ వస్తుందా? రాదా? ...అలా ఏం రాదులే... అయినా దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే...అంటూ చాలామంది అశ్రద్ధ వహిస్తున్నారు. తమకేం కాదులే అనే ధీమాతో కోవిడ్ నిబంధనలేమీ పాటించకుండా, ఎంచక్కా తిరిగేస్తున్నారు. కానీ, మీకో హెచ్చరిక... కోవిడ్ 19 తిరిగి ఈ నెలలోనే ఉధృతంగా మారనుంది.
భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే, దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త వహించండి. భౌతిక దూరాన్ని పాటించండి. ఎప్పటికపుడు చేతులకు శానిటైజ్ చేసుకోండి. చక్కగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా మంచిది. అలాగే, పెళ్ళిళ్ళూ, పబ్బాలు అంటూ, సమూహాల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే, గాలిలో వ్యాపించే కోవిడ్ 19, ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో తేలికగా మనకు సంక్రమిస్తుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త!