గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులెన్ని?

గురువారం, 18 నవంబరు 2021 (10:28 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన చేసింది. ఈ మీడియా బుల్లిటెన్ మేరకు మంగళవారం నాడు 10,197 కేసులు నమోదుకాగా, గత 24 గంటల్లో ఆ కేసుల సంఖ్య 12 వేలకు చేరువైంది. ఈ కేసుల క్రితం రోజుతో పోల్చితే 15 శాతం అధికం కావడం గమనార్హం. 
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,919 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,78,517కు చేరాయి. ఇందులో 3,38,85,132 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 
 
అదేవిధంగా 1,28,762 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,64,623 మంది మృతిచెందారు. కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకువ 11,242 మంది కరోనా నుంచి బయటపడగా, 470 మంది మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.37 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ఠమని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు