అలాగే కరోనాపై ఆశిష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టదని, వ్యాక్సిన్ తయారు చేసే వరకు అది మనల్ని వదలదన్నారు. అంటే ఇంకా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని బాంబు పేల్చారు.
అయితే కరోనా నుంచి తప్పించుకోవాలంటే రెండు మూడు మార్గాలే ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి మనం సామాజిక దూరం పాటించడం, రెండోది పరీక్షలు చేయించడం. మూడోది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఇదే సమయంలో భారత్ కరోనాపై చేస్తున్న పోరాటంపై కూడా ప్రస్తావించారు.