కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే.. ఆ ఐదు పనులు చేయకండి..
మంగళవారం, 24 మార్చి 2020 (14:18 IST)
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ కోరనా. ఈ వైరస్ సోకిన వారు ప్రపంచంలో లక్షలకు చేరుకున్నారు. మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్‌కు ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు.
అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాంటి ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే రక్షణ పొందడం కోసం అనుసరించవలసిన సామాన్యమైన ఐదు పనుల గురించి గూగుల్ తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది. అవేమిటంటే.
చేతులు : తరచుగా సబ్బుతో కడుక్కోవడం.
మోచేతులు : మోచేతులతో నోరు మూసి, దగ్గాలి.
ముఖం : చేతులతో పదేపదే ముఖాన్ని తాకకూడదు.
కాళ్లు : మూడు అడుగుల దూరం పాటించాలి.
సుస్తీ :ఒంట్లో బాగోలేదా? ఇంటిపట్టునే ఉండటం ఉత్తమం. మరీ బాగాలేకుంటే వైద్యుడిని సంప్రదించాలి.