ఈ క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌లో డోసుల సంఖ్య గురువారానికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ విజయాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటించనున్నారు.
అలాగే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్ కైలాశ్ ఖేర్ ఆలపించిన పాటను, ఒక ఆడియో.. విజువల్ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ పూర్తయింది.