దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్పల్పంగా పెరిగాయి. గురువారం వెల్లడించిన కేసులతో పోల్చుకుంటే శుక్రవారం వెల్లడైన కేసుల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 1,109 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నాటి కేసులతో పోల్చుకుంటే 76 కేసులు అధికం. అదేసమయంలో కరోనా వైరస్ బాధితుల్లో 43 మంది చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 36 మంది మరణించడం గమనార్హం.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,492 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. అదేసమయంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,00,002 మంది కోలుకున్నారు. మరో 5,21,573 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 185 కోట్ల కరోనా డోసులను వేశారు.