దేశంలో కొత్తగా మరో 14,830 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 4.29 లక్షల మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఈ వైరస్ సోకిన వారిలో 36 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో పేర్కొంది.
ఇకపోతే, ఈ వైరస్ బాధితుల్ల 18159 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,32,46,829 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 5,26,110 మందికి ప్రాణాలు కోల్పోయారు.