ప్రధానంగా మూడు లక్ష్యాలను సాధించడంపై దృష్టిసారించినట్లు చెప్పారు. అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూడటం, 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం, పిల్లలు మళ్లీ బడిబాట పట్టడానికి పాఠశాలలను తెరవడం తన లక్ష్యాలని వెల్లడించారు. వీటి సాధన కోసం తాను ఎంపిక చేసిన వైద్య బృందం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ఫైజర్‌కు అమెరికా అనుమతి
కరోనా వైరస్ నియంత్రణ కోసం ఫైజర్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు చెందిన నిపుణుల కమిటీ నిర్వహించిన ఓటింగ్‌లో ఫైజర్‌కు గ్రీన్‌సిగ్నల్ దక్కింది. ఓటింగ్‌లో పాల్గొన 17 మంది అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు వ్యతిరేకించారు.
ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్19 టీకా వల్ల 16 ఏళ్లు దాటిన వారిలో ఎటువంటి ఇబ్బందులు కలగలేదని గుర్తించారు. ఇప్పటికే ఫైజర్ టీకాకు బ్రిటన్, కెనడా, బహ్రాయిన్, సౌదీ అరేబియాలో ఆమోదం తెలిపాయి.
రష్యా, చైనాకు చెందిన వ్యాక్సిన్లను ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. బ్రిటన్‌లో 90 ఏళ్ల బామ్మకు తొలి ఫైజర్ టీకాను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అలర్జీ ఉన్న వాళ్లు ఆ టీకాను వేసుకోవద్దు అంటూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.