మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు.. 45వేలు దాటిన మృతులు

బుధవారం, 11 నవంబరు 2020 (23:00 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్‌ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 4,907 పాజిటివ్‌ కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,31,833కు, మరణాల సంఖ్య 45,560కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 9,164 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,97,255కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 92.23 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 88,070 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మృతులపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు