ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు దుమ్ము రేపుతున్నాయి. అంతకంతకూ ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో మొత్తం 14,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులతో కలుసుకుంటే మొత్తం కేసుల సంఖ్య 21,95,136కు చేరిందని తెలిపింది.
అలాగే, గత 24 గంటల్లో ఏడుగురు చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 పాజిటివ్ కేసులు ఉండగా, 4,800 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి విముక్తి పొందిన వారిలో 20,87,282 మంది ఉన్నారు.
3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా ఐదో రోజు కూడా మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఈ కేసుల నమోదులో కాస్త తగ్గుముఖం కనిపించింది. ఆదివారం కంటే సోమవారం 27469 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు ప్రస్తుతం దేశంలో 03,06,064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించారు.
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. ఇందులో 3,68,04,145 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 4,89,849 మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.