దడపుట్టిస్తున్న ఒమిక్రాన్ - కొత్త మార్గదర్శకాలు జారీ

గురువారం, 23 డిశెంబరు 2021 (17:33 IST)
దేశంలో కరోనా వైరస్ దడపుట్టిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క రోజే తమిళనాడులో ఏకంగా 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అలాగే, దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడి కోసం కేంద్రం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. 
 
ఈ వైరస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కోవిడ్ క్లస్టర్లగా ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పర్యవేక్షించాలని, కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, పండగల సీజన్‌లో ఆంక్షలు, పరిమితులు విధించాలని, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి టీకాలు వేయాలని సూచన చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు