గుజరాత్ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను 15రోజుల పాటు పొడిగించారు. కరోనా నిరోధానికి అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లో ఫిబ్రవరి 28వతేదీతో కర్ఫ్యూ ముగియనున్నందున మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ గుజరాత్ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు మున్సిపల్ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.