నిజామాబాద్ తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

సోమవారం, 15 జూన్ 2020 (19:54 IST)
తెలంగాణ రాష్ట్రానికి ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకగా, సోమవారం మరో ఎమ్మెల్యేకు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా నిజామాబాద్ పట్టణ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యుడు గుణేష్ గుప్తాకు ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ బారినపడిన మూడో ప్రజాప్రతినిధి. అలాగే, తెరాసకు చెందిన మూడో ఎమ్మెల్యే కావడం గమనార్హం. 
 
ఇప్పటికే తెరాస ఎమ్మెల్యేలైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డిలు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా గణేష్ గుప్తా ఈ వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతూ రాగా, ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. 
 
కాగా, ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని కలిసిన అధికారులు, పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. అలాగే, మరో ఎమ్మెల్యే బిగాల కూడా ముత్తిరెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన నుంచే బిగాలకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు