కరోనా మహమ్మారి వదిలేట్టు లేదే.. ఒకే అపార్ట్‌మెంట్‌లో 100 కేసులు

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (22:24 IST)
కరోనా మహమ్మారి ఇంకా జనాలను వదిలిపెట్టేలా లేదు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా బహుళ అంతస్తు భవనంలో ఏకంగా 100 మందికిపైగా కరోనా బారినపడ్డారు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ప్రైవేట్‌ పార్టీ భవనంలో ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూర్‌ మున్సిపాలిటీ బొమ్మనహల్లి జోన్‌ పరిధిలోని బిలేకహల్లి ప్రాంతంలో ఎస్‌వీవీ లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో సుమారు 435 ప్లాంట్లలో 1500 మంది నివాసిస్తున్నారు. ఈ నెల 6న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో ప్రైవేట్‌ పార్టీ నిర్వహించగా 45 మంది హాజరయ్యారు. ఈ నెల 10న వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
అప్రమత్తమైన స్థానిక మున్సిపల్‌ అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా మంగళవారం వరకు డ్రైవర్లు, పని మనుషులు, వంట మనుషులతో సహా 103 మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా బారినపడిన వారిలో చాలామందికి లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. కరోనా బారినపడిన వారిలో చాలామంది యువతేనని వీరిని క్వారంటైన్‌కు పంపామని, భవనాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశామని వెల్లడించారు.
 
ఆదివారం సుమారు 513 మందికి, సోమవారం మరో 600 మందికి, సోమవారం మరో 300 మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం బ్రిహాన్‌ బెంగళూర్‌ మున్సిపల్‌ సీనియర్‌ అధికారులు అపార్టమెంట్‌ను సందర్శించి నివాసితులు పాటించాల్సిన నిబంధనలపై అపార్ట్‌మెంట్‌ కార్యదర్శి, సిబ్బందితో చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు