కండల వీరుడికి కరోనా వైరస్.. క్వారంటైన్‌లో స్టార్ హీరో

గురువారం, 19 నవంబరు 2020 (13:06 IST)
బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన వ్యక్తిగత డ్రైవర్‌తోపాటు ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి 14 రోజులపాటు తాను కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కరోనా బారిన పడిన తన సిబ్బందికి సల్మాన్ ముంబైలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, తన తల్లిదండ్రలు సలీంఖాన్‌, సల్మా ఖాన్‌ల వివాహ వార్షికోత్సవ వేడుకలను కరోనా వల్ల రద్దు చేశారు.
 
లాక్‌ డౌన్‌ సమయంలో సల్మాన్‌ తన కుటుంబ సభ్యులతో పామ్‌ హౌస్‌లో ఉండి వ్యవసాయం చేశారు. అక్కడి నుంచే ఆయన కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కండల వీరుడు తన అభిమానులకు సూచించారు. అవరసరమైనప్పుడే బయటలకు రావాలని, ఒక వేళ వస్తే.. సామాజిక దూరం, మాస్క్‌లు ధరించాలని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు