ముఖ్యంగా, జ్వరం, దగ్గ, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను విడిగా మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తామని, దీనిపై అక్కడి ఇన్‌చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలియజేశారు.
ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 550కి చేరువైంది. బుధవారం ఒక్కరోజులో 90 మంది బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించగా, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఇదిలావుంటే, చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లావాసి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లాలోని ఎర్రావారిపాలెం, నెరబైలుకు చెందిన కుండ్ల గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి ఆయన తిరిగొచ్చాడు.