రాజస్థాన్‌లో తెలుగు విద్యార్థులు.. బిస్కెట్లు తిని బతుకుతున్నారు..

శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:41 IST)
Students
ఏపీ, తెలంగాణ విద్యార్థులు రాజస్థాన్‌లో చిక్కుకున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాజస్థాన్‌ నీట్‌, ఐఐటీ కోచింగ్‌ కోసం వెళ్లిన సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు వివిధ వసతి గృహాల్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం హాస్టళ్లు మూసివేశారనీ, తమను వెళ్లిపోవాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తుండటంతో తినడానికి ఏం దొరక్క బిస్కెట్లు తిని ఉంటున్నామని తెలుపుతూ తమ ఆవేదనతో కూడిన వీడియో సందేశాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలకు పంపించారు. 
 
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థుల్ని తీసుకెళ్లాయనీ.. తమను కూడా స్వరాష్ట్రాలకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు