కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...

శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:24 IST)
కరోనావైరస్ పట్టుకున్నప్పటికీ దానిపై పోరాడి ఎలాగో బయటపడినప్పటికీ దాని తాలూకు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నట్లు వైద్య పరిశోధనల్లో వెలుగుచూసింది. కోవిడ్ నుంచి బయటపడినవారిలో కనీసం 20 శాతం మందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

 
మరీ ముఖ్యం 25-50 ఏళ్ల మధ్యవయస్కులకు ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు పట్టుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కోవిడ్ చికిత్స సమయంలో వెంటిలేటర్ సాయం తీసుకున్నవారిలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వున్నట్లు చెపుతున్నారు.

 
ఇంకా కండరాలు బలహీనం, మతిమరుపు, కంటిచూపు తగ్గిపోవడం, జుట్టు ఊడిపోవడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు వున్నట్లు చెపుతున్నారు. వాటితో పాటు ఒత్తిడి, మానసిక వేదన, గుండెదడ వంటి లక్షణాలు కూడా వున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ సమస్య సుమారు ఆరు నెలల పాటు వేధించే అవకాశం వున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కనుక ఈ సమస్యల నుంచి బైటపడేందుకు తగు ఆరోగ్య జాగ్రత్తలతో పాటు వ్యాయామం, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు