పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

గురువారం, 21 జులై 2022 (10:53 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం 20 వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు గురువారం 21 వేలు దాటిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు సంఖ్య 1.50 లక్షలకు చేరువైంది. 
 
గడిచిన 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీలు కూడా పెరుగుతుండటం మాత్రం సానుకూలాంశం.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. దేశవ్యాప్తంగా 5,07,360 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 21,566 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంటే రోజువారీ పాజిటివిటీ రేటు 21,566గా ఉంది. 
 
మరోవైపు, 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 18,294 ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4.31 కోట్లకు చేరుకుంది. అంటే రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,48,881, క్రియాశీల కేసుల రేటు 0.34 శాతంగా ఉండగా, 24 గంటల్లో మరణాలు 45 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుకుంటే ఇప్పటివరకు దేశంలో 5.25 లక్షల మంది చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు