దేశంలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

గురువారం, 23 జూన్ 2022 (09:34 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 13315 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ కేసులు 12 వేలుగా మాత్రమే ఉన్నాయి. 24 గంటల్లో మరో వెయ్యి కేసులకు పైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958గా ఉంది. ఇందులో 4,27,36,027 మంది కరోనా బాధితులు కోలుగా 83990 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇప్పటివరకు 524941 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 38 మంది చనిపోగా, ఈ వైరస్ నుంచి 10972 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.19 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.60 శాతంగా ఉన్నాయి. మరణాల శాతం మాత్రం 1.21 శాతంగా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు