కరోనాకు వ్యాక్సిన్... అప్రూవ్ చేసిన తొలి దేశం ఏది?

బుధవారం, 2 డిశెంబరు 2020 (15:12 IST)
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను ఇచ్చిన తొలి దేశంగా బ్రిటన్ గుర్తింపు పొందింది. అంటే, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేయగా, దానికి అప్రూవ్ చేసిన తొలి దేశంగా బ్రిటన్ అవతరించింది. ఈ వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి ఆ దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 
 
ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్‌పై ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు యూకే ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పింది.
 
అయితే, తొలి దశలో వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని బ్రిటన్‌కు చెందిన వ్యాక్సిన్ కమిటీ నిర్ధారించనుంది. తొలుత వృద్ధులకు ఇవ్వాలా? ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలా? అనే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
 
ఈ వ్యాక్సిన్ పక్కగా 90 శాతం మేరకు పని చేస్తున్నట్టు ఫైజర్‌తో పాటు, యూఎస్ కు చెందిన బయోటెక్ ఫర్మ్ మోడెర్నా తన ప్రాథమిక నివేదికలో తెలిపింది. మరోవైపు దీనిపై యూకే ప్రభుత్వం స్పందిస్తూ... కరోనాపై జరుగుతున్న పోరాటంలో ఇదొక గొప్ప మలుపు అని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు