బ్రిటన్ కన్నా ముందు.. అమెరికా(4.35లక్షలు), బ్రెజిల్(2.18లక్షలు), భారత్(1.53లక్షలు), మెక్సికో(1.5లక్షలు)లలో మాత్రమే లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1లక్షా 162మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. బ్రిటన్‌లో రోజువారీ కేసుల్లో అది కనిపించటం లేదు.
కొవిడ్ మృతులను దేశం స్మరించుకుంటుందని, విపత్కర పరిస్థితులను తొలగించేందుకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పటివరకూ 36లక్షల 89వేల మంది కరోనా బారినపడ్డారు. వారిలో 16లక్షల 62 వేల మంది కరోనాను జయించారు.