ప్రజల్లో ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణుల వల్లే వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా వేయించుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించడం వల్లే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమంటున్నారు.
ఈ పరిస్థితుల్లో నిరంతరం అప్రమత్తతే రక్షణ కల్పిస్తుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, వైద్య నిపుణులు ప్రభుత్వాలు చెబుతున్నట్టుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు.
ఈ జాగ్రత్తల్లో భాగంగా, మాస్క్‌లు ధరించకుండా బయటకు వెళ్లొద్దు. మాస్కులేని సంచారం రిస్కుతో కూడిన వ్యవహారం. మాస్క్ లేకుండా తిరిగితే కఠిన చర్యలకు అవకాశం. బస్సులు, థియేటర్లు, మార్కెట్ల వద్ద అప్రమత్తతే రక్షణ.
శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని నేరుగా చేతులతో తాకొద్దు. గోరువెచ్చని నీటిని తాగండి. కరచాలనం కంటే నమస్కారం ఆరోగ్యకర పలకరింపు. జలుబు, ఆగని దగ్గు, గొంతునొప్పి, జ్వరం కరోనా అనుమానిత లక్షణాలు. వేడుకల్లో గుంపులుగా తిరగడం మంచిది కాదు. కరోనా లక్షణాలుంటే విధిగా పరీక్ష చేయించుకోవాలి.