అతడి చర్యను గమనించిన బంధువులు, స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆ హడావుడిలో తెగిపడిన నాలుక ముక్క తీసుకెళ్లకపోవడంతో మైక్రోసర్జరీ చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసి నాలుకను అమర్చే ప్రయత్నం చేస్తామని వారు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కానీ, గురువారం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఏమాత్రం పోరాటం చేయకుండా చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే.