అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఫాల్కనర్ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు తప్పుదోవపట్టడం సరికాదని ఫాల్కనర్ హెచ్చరించారు. తప్పతాగి వాహనాలు నడపడంలో ఉండే నష్టాలను గుర్తించాలని ఫాల్కనర్కు సూచించినట్టు ఆసీస్ క్రికెట్ జట్టు పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ చెప్పారు. కాగా, షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్ గతంలో తాగి వివాదాలు రేపినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.