వరల్డ్ కప్‌లో భారత్ రికార్డు బద్ధలు..417తో ఆస్ట్రేలియా హైయెస్ట్ స్కోర్!

బుధవారం, 4 మార్చి 2015 (18:37 IST)
వరల్డ్ కప్‌లో భారత్ రికార్డును ఆస్ట్రేలియా బద్ధలు కొట్టింది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 417 పరుగులు చేసింది. దీంతో ఇప్పటి వరకు భారత్ పేరిట ఉన్న 413 పరుగుల రికార్డు బద్ధలైంది. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, ఆదిలోనే ఫించ్ వికెట్ కోల్పోయినప్పటకీ... మిగిలిన బ్యాట్స్ మెన్ అదుర్స్ అనిపించేలా బ్యాట్‌ను ఝళిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశారు. వార్నర్ 178 (133), స్మిత్ 95 (98), మ్యాక్స్ వెల్ 88 (39 బంతులు, 7 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులతో విజృంభించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 417 పరుగులు భారీ స్కోర్‌ను చేసింది. అనంతరం 418 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ జట్టు.. 50పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది.

వెబ్దునియా పై చదవండి