శ్రీలంకలో టీమిండియా టూర్: భార్యలు, లవర్స్‌ని తీసుకెళ్లొద్దు..! కోహ్లీ కోసమే..?

శుక్రవారం, 31 జులై 2015 (16:16 IST)
శ్రీలంకలో టీమిండియా పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది. గతంలో లవర్స్, భార్యల్ని ఆటగాళ్లతో విదేశీ టూర్లతో పంపి.. విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆగస్టు మొదటి వారం నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్‌తో పాటు మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
 
ఈ సందర్భంగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేసింది. లంక టూరుకు ఆటగాళ్లెవరూ తమ భార్యలను కానీ, లవర్స్‌ను కానీ తీసుకెళ్లకూడదని హుకుం జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆటగాళ్లకు రుచించకపోయినా.. మంచి ఆటతీరును రాబట్టాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ షరతును పెట్టిందని క్రీడా పండితులు అంటున్నారు.
 
కాగా గతంలో వరల్డ్ కప్ సందర్భంగా అనుష్క శర్మ సెమీస్ రావడంతోనే కోహ్లీ మెరుగ్గా ఆడలేకపోయాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగిన క్రికెట్ సిరీస్‌కు భార్యల్ని, లవర్స్‌ని తీసుకెళ్లవచ్చని బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పెను దుమారం రేపిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి