అండర్-19 వరల్డ్ కప్: భారత్‌పై ఐదు వికెట్ల తేడా విండీస్ గెలుపు

ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (16:58 IST)
అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్ నిలిచింది. భారత్‌తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ పరుగుల వేటలో తడబడినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకుని ఆడింది. కార్టీ, పాల్ నిలదొక్కుకుని ఆడి వెస్టిండీస్ జట్టుకు గెలుపును చేకూర్చారు. తద్వారా మూడు బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ జట్టు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 
 
కాగా, భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (51) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లలో పోప్ (3), ఇమ్లాచ్ (15), హెట్మెర్ (23), కార్టీ (52), స్ప్రింగర్ (3), గూలీ (3), పాల్ (40)లు మోస్తరుగా రాణించారు. దీంతో 49.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 146 పరుగులు సాధించింది. ఇక కార్టీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

వెబ్దునియా పై చదవండి