యజువేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్..

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (10:09 IST)
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తనకు కాబోయే భార్య  ధనశ్రీ వర్మతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టుకు అతడు జత చేసిన క్యాప్షన్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 
 
ఇద్దరూ మెట్లపై గుర్చుని ఉండగా.. ధనశ్రీ, చాహల్‌ వైపు ఒదిగి కూర్చున్నారు. ఇద్దరూ నవ్వూతూ ఫోజ్‌ ఇచ్చిన ఈ ఫొటోకు మీరిచ్చిన నవ్వును తాను ధరిస్తున్నానని క్యాప్షన్‌ జోడించి రెడ్‌ హర్ట్‌ ఎమోజీతో షేర్‌ చేశాడు. అదే విధంగా "మీకు స్వాగతం.. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి" అంటూ రాసుకొచ్చాడు
 
ఇక అది చూసిన నెటిజన్లు చహల్‌ క్యాప్షన్‌కు ఫిదా అవుతున్నారు. ఐతే చాహల్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరగుతున్న ఐపీఎల్‌ 2020కి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 
 
ఐపీఎల్‌ ప్రారంభంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇందులో చాహల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఆవార్డును గెలుచుకున్నాడు. అయితే యూట్యూబర్‌, కోరియోగ్రఫర్‌ అయినా ధనశ్రీని త్వరలో పెళ్లాడనున్నట్లు అగష్టులో చహల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు