బెర్ముడాలో క్లబ్ క్రికెట్ క్లెవలాండ్ కంట్రి క్లబ్ - విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా... జాసన్ అండర్సన్, జార్జ్ ఒబ్రాయిన్ అనే క్రికెటర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య తొలుత వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే నియంత్రణ కోల్పోయిన అండర్సన్ ఒక్కసారిగా ఒబ్రాయిన్‌పై విరుచుకుపడ్డాడు. ఒబ్రాయిన్‌పై బ్యాట్‌తో దాడి చేసి అండర్సన్ గాయపరిచాడు. దీంతో ఫీల్డ్ నుంచి అండర్సన్‌ను పంపించి వేశారు.
నిజానికి జెంటిల్‌మేన్ గేమ్ క్రికెట్లో వాదులాటలకు తావు లేదు. అయితే టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ, మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌లతో పాటు ఆసీస్ జట్టు సభ్యులు మాత్రం ఇందుకు అతీతం. మైదానంలో వీరున్న చోట వాదులాటలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా వాదులాటలు శృతి మించి ముష్టి యుద్ధాల వరకు దిగడం ఈ క్రికెట్‌కే మచ్చ కలిగించే అంశంగా మారింది.