తాజాగా ఇంగ్లండ్ కూడా కివీస్ సరసన నిలిచింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హేల్స్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
హారి బ్రూక్ )4), లివింగ్‌స్టోన్ (4) మోయిన్ అలీ (1), శామ్ కరన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బెన్‌స్టోక్స్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు.