సునీల్ గవాస్కర్ : కోచ్ పదవికి సౌరవ్ గంగూలీనే బెస్ట్!

మంగళవారం, 19 మే 2015 (11:16 IST)
టీమిండియా కోచ్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మెరుగ్గా రాణించే అవకాశాలున్నట్లు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గంగూలీ అనుభవం ప్రస్తుత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నాడు.

భారత జట్టు హెడ్ కోచ్గా లేదా టీమ్ డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. డంకెన్ ఫ్లెచర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి గంగూలీ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ పదవికి గంగూలీయే ఉత్తమమని గవాస్కర్ అన్నాడు. 'భారత్ ఆడబోయే మ్యాచ్లు ఎక్కువగా స్వదేశంలో, ఉపఖండంలో ఉన్నాయి. జట్టు కోచ్ పదవిలో గంగూలీని నియమిస్తే జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడు.

దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ల అవసరం ఉండదు' అని గవాస్కర్ చెప్పాడు. టీమిండియా కోచ్ పదవికి ఇటీవల గంగూలీ పేరు వినిపిస్తున్నా.. అతడు తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

వెబ్దునియా పై చదవండి