హార్దిక్ పటేల్‌ గారూ... మ్యాచ్‌కు అంతరాయం కలిగించొద్దు: జూనియర్ క్రికెటర్ల విజ్ఞప్తి

మంగళవారం, 13 అక్టోబరు 2015 (15:18 IST)
రాజ్‌కోట్‌ మూడో వన్డే మ్యాచ్‌లో తమ మద్దతుదారులు కొందరు రిజర్వేషన్లు కోరుతూ ప్లకార్డులు చూపుతారని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ ప్రకటించిన నేపథ్యంలో.. అప్రమత్తమైన ఎస్‌సీఏతో పాటు క్రికెటర్లు, అభిమానులు మ్యాచ్‌‍కు ఆటంకం కలిగించవద్దని హార్దిక్‌ను వేడుకున్నారు.

రాజ్‌కోట్‌లో ఈ నెల 18న (ఆదివారం) భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మూడో వన్డే మ్యాచ్‌కు అంతరాయం కలిగించవద్దని 50 మంది జూనియర్ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు హార్దిక్‌ను విజ్ఞప్తి చేశారు. 
 
హార్దిక్‌ను కలిసి మూడో వన్డేకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరుతామని యువక్రికెటర్లు కొందరు తమ కోచ్‌ను అడిగారని, దానికి ఆయన అంగీకరించినట్టు సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) మీడియా మేనేజర్‌ హిమాంశు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి