ఐపీఎల్‌లో ప్రదర్శన ప్రామాణికం కాదు: ధోనీ సెన్సేషనల్ కామెంట్

మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:42 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆధారంగా ఆటగాళ్లను టెస్టులకు, వన్డేలకు ఎంపిక చేయడం సరికాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా కోసం ఎంపికవ్వాలంటే.. ఐపీఎల్‌లో ప్రదర్శన ప్రామాణికం కాదని ధోనీ సెన్సేషనల్ కామెంట్ చేశాడు. 
 
ప్రధానంగా టెస్టులు, వన్డేల్లో ఆడేందుకు ఐపీఎల్ ప్రదర్శనను పట్టించుకోనక్కర్లేదని ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వంటి టోర్నీలు ఆటగాడిలో ఉన్న ప్రతిభను చాటేందుకు మాత్రమే ఉపయోగపడతాయని ధోనీ తెలిపాడు. ఇదే విషయం యువ ఆటగాళ్లకు తాను చెబుతుంటానని కెప్టెన్ తెలిపాడు. 
 
టీమిండియాలో రోహిత్ శర్మ, అంబటి రాయుడు, శిఖర్ ధావన్, హార్ఢిక్ పాండ్యా, పవన్ నేగి, కరణ్ శర్మ, అశోక్ ధిండా, స్రాహ, బుమ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ప్రదర్శనే ప్రామాణికంగా జాతీయ జట్టులోకి ప్రవేశించిన నేపథ్యంలో ధోనీ వ్యాఖ్యలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి