రాయుడు దెబ్బ... జింబాబ్వేపై 4 పరుగుల తేడాతో భారత్ విజయం

శుక్రవారం, 10 జులై 2015 (20:52 IST)
అంబటి రాయుడు (124) నాటౌట్ దెబ్బ ఒకవైపు, భారత్ బౌలర్ల దెబ్బ ఇంకోవైపు... దీనితో జింబాబ్వే 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడింది. 50 ఓవర్లలో 251 పరుగలు మాత్రమే చేయగలిగింది. చేతిలో వికెట్లు ఉన్నా ఉపయోగించుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాట్సమన్లలో చిగుంబురా (104) నాటౌట్ గా నిలబడినా మిగిలినవారు వికెట్లు పారేసుకున్నారు. శిబంద 20 పరుగులు, చిభాబ 3, మసకడ్జ 34, విలియమ్స్ 0, రాజా 37, ముతుంబామి 7, క్రెమర్ 27, ట్రిరిపాన్ 1 పరుగు చేశారు. చివరి రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించవచ్చు అని అనుకున్నా భారత్ బౌలర్ల దెబ్బకు సాధ్యం కాలేదు.

వెబ్దునియా పై చదవండి