లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నా కొన్నింటిపైనే వ్యతిరేకంగా ఉంది. అభ్యర్థుల వయోపరిమితి 70 ఏళ్లు, రెండు పదవుల మధ్య 3 ఏళ్ల విరామం , ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి కొన్ని అంశాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బోర్డు వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.