ఇక 200 వికెట్లు తీసిన 8వ సౌతాఫ్రికా బౌలర్‌గా కూడా రబడా గుర్తింపు పొందాడు.డేల్ స్టెయిన్(439) హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉండగా.. షాన్ పొలాక్(421), మఖయా ఎన్తినీ(390), అలాన్ డొనాల్డ్(330), మోర్నీ మోర్కెల్(309), జాక్వస్ కల్లీస్(291), వెర్నన్ ఫిలాండర్(224) రబడా కన్నా ముందున్నారు.
పాక్ జట్టులో ఫవాద్ అలామ్(109) సెంచరీతో రాణించగా.. అజార్ అలీ(51), ఫహీమ్ అష్రఫ్(64) హాఫ్ సెంచరీలతో మెరిసారు. సఫారీ బౌలర్లలో రబడా, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ లంచ్ బ్రేక్ సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.